గూడూరులో గడ్డివాము అగ్నికి ఆహుతి – రూ. లక్ష నష్టం

గూడూరు పట్టణంలో మంగళవారం రాత్రి రైతు దొడ్ల సుంకన్నకు చెందిన గడ్డివాము అగ్నికి ఆహుతైంది. పులకుర్తి రహదారిపై ఉన్న పొలంలో ఏర్పాటు చేసిన గడ్డివామును గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉండవచ్చని బాధితుడు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు రైతు తెలిపారు. అగ్నిమాపక శాఖ స్పందించలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్