బురాన్ దొడ్డి: మహిళల భద్రతపై పోలీసుల అవగాహన

సి. బెళగల్ మండలంలోని బురాన్ దొడ్డి గ్రామంలో శనివారం పోలీస్ స్టేషన్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్ రాజు ఆధ్వర్యంలో ప్రజా అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలపై నేరాల నివారణ, రోడ్డు భద్రతా నియమాలు, భూ వివాదాలపై చట్టపరమైన పరిష్కారాల గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. నేరాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్