విద్యాభివృద్ధే కుటమి ప్రభుత్వ లక్ష్యమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. గురువారం సి. బెళగల్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.