సి. బెళగల్ మండలం కాంపాడు గ్రామానికి చెందిన నాగన్న, ఓంకార్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. హరి కుమార్ రెడ్డి అనే వ్యక్తి కెనరా బ్యాంకులో మినీ బ్యాంక్ పాయింట్ నిర్వహిస్తూ, తాను బ్యాంకు ఉద్యోగినని నమ్మించి ప్రజల నుంచి సుమారు రూ. 6 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేశాడని ఆరోపించారు. రైతులు, ఖాతాదారుల నుంచి పొదుపు, మార్ట్‌గేజ్ రుణాలు తదితర లావాదేవీల పేరుతో డబ్బులు తీసుకుని బ్యాంకులో జమ చేయకుండా దుర్వినియోగం చేశాడని, అనంతరం ఐపీ నోటీసులు ఇచ్చి పరారయ్యాడని తెలిపారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.