సి. బెళగల్ మండలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల అమ్మకాలు తప్పనిసరిగా ఈ-పాస్ విధానంలోనే నిర్వహించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ డీలర్లను ఆదేశించారు. బుధవారం ముడుమాల, పోలకల్ గ్రామాల్లోని విత్తన, ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముడుమాలలోని న్యూ నటరాజ్ ఏజెన్సీ, పోలకల్ లోని సాయి మీ రైతు సేవా కేంద్రంలో ఎరువుల అమ్మకాల రికార్డులు, నిల్వల్లో వ్యత్యాసాలు గుర్తించి, డీలర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మిని ఆదేశించారు.