ఎనగండ్లలో రెండు కుటుంబాల ఘర్షణ.. కేసు నమోదు

సి. బెళగల్ మండలంలోని ఎనగండ్ల గ్రామంలో బుధవారం రెండు కుటుంబాల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎస్సై వేణుగోపాల్ రాజు మాట్లాడుతూ, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్