కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గురువారం గూడూరు మండలం పెంచికలపాడులోని జిన్నింగ్ మిల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తేమ 8% లోపు ఉన్న పత్తికి క్వింటా రూ. 8,110 ధర నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆకెపోగు సుగుణమ్మ, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు ఆకెపోగు జయన్న, గోపాల్ రెడ్డి, ఎంపీటీసీ మద్దిలేటి, కర్ణం చిన్నగిడ్డయ్య, బంగారు శ్రీనివాసులు, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.