దిన్నేదేవరపాడు: ఇంటి పట్టాలకు స్థలాలు చూపించాలి: కాంగ్రెస్

కర్నూలు మండలం దిన్నేదేవరపాడులో 2013లో మంజూరైన ఇంటి పట్టాలకు వెంటనే స్థలాలు చూపించి, హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ సోమవారం కర్నూలు కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కోడుమూరు అసెంబ్లీ ఇంచార్జ్ అనంతరత్నం మాదిగ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీసాల సుమలత, కర్నూలు మండల అధ్యక్షురాలు బొగ్గుల హైమావతి, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సిరికి వినతిపత్రం అందజేశారు. సుమారు 300 మంది నిరుపేదలకు పట్టాలు ఇచ్చినా 13 సంవత్సరాలు గడిచినా స్థలాలు చూపించలేదని వారు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్