కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడు గ్రామ ప్రజల సొంతింటి కల నెరవేరకపోవడంపై జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అడ్వకేట్ బోయ క్రాంతి నాయుడు విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారినా గ్రామస్తుల సమస్యలు పరిష్కారం కాకపోవడం సిగ్గుచేటన్నారు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 300 మందికి పైగా పేద కుటుంబాలకు ఇంటి పట్టాలు మంజూరు చేసినా, అనంతర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడంతో లబ్ధిదారులు ఇప్పటికీ ఇళ్ల నిర్మాణానికి నోచుకోలేకపోతున్నారని తెలిపారు.