కర్నూలు రూరల్ మండలం నిడ్జూరు గ్రామంలో బుధవారం హత్యాయత్నం జరిగింది. బీసీ కాలనీలో ఉంటున్న కురువ నాగులు తన కుమార్తెతో బైకుపై ఇంటికి వస్తుండగా, కరెంట్ డిపో ప్రాంతంలో తన వైపు ఎందుకు వస్తున్నావు అంటూ లాలూ అనే వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో లాలూ, అతని సోదరులు కర్రలతో నాగులు, ఆయన భార్య శివలక్ష్మి, మామపై దాడి చేశారు. దీంతో గాయపడిన నాగులును స్థానికులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.