కోడుమూరు నియోజకవర్గంలో బీఎల్ఓలకు ఎస్‌ఐఆర్ కిట్ల పంపిణీ

భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు కోడుమూరు నియోజకవర్గ పరిధిలో ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి సంబంధించిన కిట్లను బీఎల్ఓలు, సూపర్వైజర్లకు గురువారం గూడూరు మండలంలోని వెలుగు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ ఆఫీసర్ సందీప్ కుమార్, డివిజనల్ ఆఫీసర్, గూడూరు తహసీల్దార్, ఏఈఆర్వో శ్రీడి వెంకటేష్ నాయక్, మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలు, కార్యాచరణ ప్రణాళిక, టైమ్‌టేబుల్, షెడ్యూల్‌ను అధికారులచే బీఎల్ఓలు, సూపర్వైజర్లకు వివరించడం జరిగింది.

సంబంధిత పోస్ట్