కోడుమూరు మండలం పులకుర్తిలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పాడి రైతు సేకన్నకు చెందిన రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. సుమారు రూ. 2 లక్షల విలువైన గడ్డి కాలి బూడిదైంది. విద్యుత్ తీగల రాపిడి వల్ల నిప్పురవ్వలు వచ్చి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.