కోడుమూరు అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి: సిపిఎం ధర్నా

కోడుమూరు తహసిల్దార్ కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో మండల అభివృద్ధి నిధులు కేటాయించాలని మంగళవారం ధర్నా నిర్వహించారు. నాయకులు రాజు, గఫూర్ మియ్యా మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పత్తి కొనుగోలులో అవకతవకలు, రహదారులు, తాగునీటి సమస్యలు, హంద్రీ నది బ్రిడ్జి పనులు నిలిచిపోవడం, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీల అవసరాన్ని వివరించారు. అనంతరం ఆర్ఐకి వినతిపత్రం అందించారు.

సంబంధిత పోస్ట్