గడివేముల: పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

గడివేముల మండలం ఎల్కేతండా గ్రామానికి చెందిన నిర్మలాబాయి(21) కుటుంబ వేధింపులతో జూలై 7న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. నగలు తాకట్టు పెట్టి విడిపించకపోవడం, భర్త శ్రీకాంత్ నాయక్, అత్తమామలు, ఆడపడుచు వేధింపులు కారణంగా ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి బుజ్జిబాయి ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్