కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి, కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ, సీఐటీయూ సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం స్థానిక కోట్ల సర్కిల్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి. రాజు, సిపిఎం మండల కార్యదర్శి గఫూర్మియా మాట్లాడుతూ, కార్మికులు పాత కార్మిక చట్టాలను తిరిగి అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక చట్టాలను రద్దు చేసిందని ఆరోపించారు.