కార్మిక రాజ్యం స్థాపనే సిఐటియు లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. 56వ సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం గూడూరులో సిఐటియు కార్యాలయం ఎదుట జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మండల నాయకులు రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు శేషమ్మ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బస్టాండ్‌లో కార్మికులకు, ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సిఐటియు 1970 మే 30న కలకత్తాలో ఆవిర్భవించిందని డివిజన్ కార్యదర్శి జే. మోహన్ తెలిపారు.