గూడూరు: అంగన్వాడీలను విడుదల చేయాలని ధర్నా

అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు మహేశ్వరి, రాజేశ్వరి, సునంద, రామేశ్వరి, మరియు సిఐటియు డివిజన్ కార్యదర్శి జే. మోహన్, మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించిందని, వారిని వెంటనే విడుదల చేయాలని గూడూరు బస్టాండులో సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో హెచ్చరించారు. గత ఐదు సంవత్సరాలుగా జీతాలు పెరగకపోవడంతో అంగన్వాడీల వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్