గూడూరు తెలుగు వీధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని బుధవారం కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, నగర పంచాయతీ అధికారులను ఆదేశించారు. వర్షానికి డ్రైనేజీ ఉప్పొంగి ఇళ్లలోకి ప్రవేశించడంతో మహిళలు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. తద్వారా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కమిషనర్ రమేష్ బాబు, టీడీపీ నాయకులు తెలుగు వీధిలో డ్రైనేజీ సమస్యను పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.