గూడూరు: విలేకరి హత్యపై నిరసన – నిందితులను అరెస్టు చేయాలి

చిత్తూరు జిల్లా పి. కోట మండలానికి చెందిన విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ నాయకులు బుధవారం గూడూరులో నిరసన తెలిపారు. శ్రీగంధం మాఫియాపై వార్తలు రాసినందుకే జగన్మోహన్ రెడ్డిని హత్య చేశారని ఆరోపిస్తూ, హత్యకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేష్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. నిజాలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్