గూడూరు: బీజేపీ ఆర్టీఐ సెల్ కన్వీనర్‌గా రాజు యాదవ్

భారతీయ జనతా పార్టీ యువమోర్చా (బీజేవైఎం) కర్నూలు జిల్లా ఆర్టీఐ సెల్ కన్వీనర్‌గా వంగూరు రాజు యాదవ్‌ను పార్టీ రాష్ట్ర నాయకత్వం నియమించింది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు కేశవ్ రామ్ చౌదరి ఈ నియామకాన్ని ప్రకటించారు. శుక్రవారం ఈ ప్రకటన వెలువడింది. గూడూరు మండలం బూడిదపాడుకి చెందిన వంగూరు రాజు యాదవ్ రైతు కుటుంబం నుంచి వచ్చి, రాజకీయ, విద్యార్థి రంగాల్లో చురుకుగా పనిచేస్తున్నారు. ఆయన గతంలో ఏబీవీపీలో పలు కీలక పదవులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్