గూడూరు: ఘోర రోడ్డుప్రమాదం, పెళ్లికూతురు సహా పదిమందికి గాయాలు

కర్నూలు జిల్లా పెద్దపాడు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి కూతురు శివలక్ష్మి సహా పది మందికి గాయాలయ్యాయి. బుధవారం కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని గూడూరులో జరగాల్సిన వివాహానికి తలంబ్రాలు తీసుకెళ్తున్న బంధువులు ప్రయాణిస్తున్న రెండు వాహనాల్లో ఒకటి పెద్దపాడు వద్ద ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్