తిమ్మగురుడు స్వామి ఆలయ టెంకాయల వేలం

కర్నూలు జిల్లాలోని గూడూరు పట్టణంలో వెలసిన శ్రీతిమ్మగురుడు స్వామి ఆలయంలో మంగళవారం నిర్వహించిన టెంకాయల వేలం పాట ఉత్సాహంగా జరిగింది. ఈ వేలంలో బోయసింగాని మద్దిలేటి రూ. 1.40 లక్షలకు టెంకాయల వేలం దక్కించుకున్నారు. మొత్తం 15 మంది సభ్యులు ఈ వేలంలో పాల్గొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ. 50,000 అధికంగా ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమం అనంతరం కమిటీ చైర్మన్, గుత్తేదారునికి పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్