ఉమ్మడి కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లాలోని 16 మండలాలు, నంద్యాల జిల్లాలోని 10 మండలాల్లో వర్షపాతం నమోదైంది. కర్నూలు నగరంలో భారీ వర్షం కురవడంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి, కాలువలు పొంగిపొర్లాయి. కర్నూలు రూరల్‌లో 56.2 మి.మీ, అర్బన్‌లో 48.6 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 9 మి.మీగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్