పసుపుల గ్రామపంచాయతీకి ఐఎస్ఓ సర్టిఫికేషన్.. జిల్లాలో తొలి ఘనత

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణ తేజ మార్గదర్శకత్వంలో, రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన పంచాయతీల్లో బుధవారం పసుపుల గ్రామపంచాయతీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందింది. రాష్ట్రంలోని 13,326 పంచాయతీలలో ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన 18వ పంచాయతీగా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొలి గ్రామపంచాయతీగా పసుపుల చరిత్ర సృష్టించింది. మొదటి విడతలో ఎంపికైన 24 పంచాయతీలలో భాగంగా, నిర్దిష్ట కాలపరిమితిలో సేవలు అందించడం, సమర్థవంతమైన నిర్వహణ, పారదర్శక పాలన, ప్రజలకు మెరుగైన సేవల కారణంగా ఈ గుర్తింపు సాధించింది.

సంబంధిత పోస్ట్