గూడూరు: 'సత్యనారాయణ రెడ్డి మృతి.. టీడీపీకి తీరని లోటు'

గూడూరు మండలంలో టీడీపీ నాయకుడు జులకల్లు సత్యనారాయణ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటని బుధవారం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, సంధ్య విక్రమ్ కుమార్ తెలిపారు. ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి సంతాపం తెలుపుతూ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. టీడీపీ నాయకులు జె. సురేష్, దానమయ్య, రేమట వెంకటేశ్వర్లు, సృజన్ పాల్గొన్నారు. సత్యనారాయణ రెడ్డి మృతితో గూడూరు మండలంలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్