కోడుమూరు పట్టణంలో శ్రీచౌడేశ్వరి దేవి తిరునాల సందర్భంగా ఆదివారం మన ఊరు మన జాతర కార్యక్రమంలో భాగంగా కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. సంతమార్కెట్‌లో సర్పంచ్ భాగ్యరత్న, రాష్ట్ర ఎమ్మార్పీఎస్ నాయకులు ఆంధ్రయ్య, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ పోటీలు మొదలయ్యాయి. ప్రథమ బహుమతిగా రూ. 25 వేల నగదును సర్పంచ్ భాగ్యరత్న, డాక్టర్ ఆంధ్రయ్య అందించనుండగా, ద్వితీయ బహుమతి రూ. 15 వేలు, తృతీయ బహుమతి రూ. 10 వేలుగా నిర్ణయించారు.