కోడుమూరు మండలంలోని ఎరువుల దుకాణదారులు రైతులకు ఎరువులను న్యాయమైన ధరలకే విక్రయించాలంటూ మండల వ్యవసాయ అధికారి రవిప్రకాష్ సూచించారు. శుక్రవారం డీలర్లతో సమావేశం నిర్వహించిన ఆయన, ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మకాలు చేయవద్దన్నారు. రైతు సేవా కేంద్రాల్లో పుష్కలంగా స్టాక్ ఉందని తెలిపారు. స్టాక్ రిజిస్టర్లు, అమ్మకాల రికార్డులు సక్రమంగా ఉండాలని, సమస్యలు తన దృష్టికి తీసుకురావాలన్నారు.