కోడుమూరు: నిరుపేదను వరించిన కానిస్టేబుల్ ఉద్యోగం

కోడుమూరు పట్టణంలోని హోటల్ లో సర్వర్ గా, పెయింటర్ గా, ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ షావలీ అనే యువకుడికి కానిస్టేబుల్ ఉద్యోగం వరించింది. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో షేక్ షావలీకి ప్రకాశం జిల్లా ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగంతో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తల్లి రజీయా వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారని, తండ్రి ఆయూబ్ నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్