కోడుమూరు నియోజకవర్గంలోని ముడుమలకుర్తి, అమడగుంట్ల, కర్నూలు మండలం జి. సింగవరం, ఎదురూరు గ్రామాల్లో బుధవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. పంటల సాగు, సస్యరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డా. ఎ. రామకృష్ణా రావు, వ్యవసాయ శాఖ సంచాలకులు ఎన్. సాలు రెడ్డి, ఏవో రవిప్రకాష్, ఉద్యానశాఖ అధికారి నరేష్, కర్నూలు మండల వ్యవసాయ అధికారి రూఫస్ రోనాల్డ్ పాల్గొన్నారు.