కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలో మంగళవారం రాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులు ఎంబీఏ రెండో సంవత్సరం విద్యార్థి ఓబులేసుపై దాడి చేశారు. ఈ దాడిలో ఓబులేసుకు ముఖానికి గాయాలై, నోటి నుంచి రక్తం వచ్చింది. మద్యం మత్తులో దాడి జరిగినట్లు సమాచారం. వైస్ చాన్స్‌లర్ వి. వెంకటబసవరావు ఘటనపై విచారణకు ఆదేశించారు.