స్మార్ట్ మీటర్లను ప్రజలపై భారాలు వేసేలా అమలు చేయడం నిరసిస్తూ సోమవారం కోడుమూరు సిపిఎం పార్టీ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. డిప్యూటీ ఇంజనీర్ జేషన్ కు వినతిపత్రం ఇచ్చారు. మండల కార్యదర్శి రాజు, జిల్లా నాయకులు అబ్దుల్లా మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పుడు కరెంటు చార్జీలను పెంచి ప్రజలపై భారాలు పెడుతున్నదని, స్మార్ట్ మీటర్లపై ఆందోళన కొనసాగుతుందని సిపిఎం తెలిపారు.