కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో డీజే సౌండ్ సిస్టమ్స్‌తో ప్రజలకు ఇబ్బందులు కలిగించిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి గ్రామ ప్రధాన వీధులు, బస్టాప్ ప్రాంతంలో వాహనాలకు డీజే సిస్టమ్స్ అమర్చి భారీ శబ్దాలతో పాటలు వాయిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రోడ్డు మధ్యలో వాహనాలను నిలిపి, నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో పాటలు వాయిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నట్లు గుర్తించి, ఉప్పరి రమేష్ (27), షేక్ ఖలీల్ (21)లపై కేసు నమోదు చేశారు.