కోడుమూరు పట్టణం కోటవీధి లోని సాయిబాబా గుడిలో గురువారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించబడాయి. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతులు ఇచ్చారు. నాయి బ్రాహ్మణ సహోదరులు, దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. అనంతరం మేళతాళాల మధ్య ఊరేగింపు జరగగా, పలువురు భక్తులు, యువకులు పాల్గొన్నారు.