కోడుమూరు: అక్రమ సారా విక్రయదారుడు అరెస్ట్

కోడుమూరు పట్టణంలో శనివారం పోలీసులు నాటుసారా విక్రయిస్తున్న దాసరి తిరుపాలును అదుపులోకి తీసుకున్నారు. కరెంట్ కార్యాలయం సమీపంలో అక్రమంగా సారా విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్సై ఎర్రిస్వామి నేతృత్వంలో దాడి నిర్వహించారు. నిందితుడి వద్ద నుంచి ఐదు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, నిందితుడిని కర్నూలు స్పెషల్ మొబైల్ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరిచినట్లు ఎస్సై తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్