కోడుమూరు: అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

కోడుమూరు పట్టణంలో శ్రీచౌడేశ్వరి దేవి తిరునాల సందర్భంగా, ఆదివారం నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆలయాన్ని సందర్శించి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్యం, శాంతి, సుఖసంతోషాలు కలగాలని, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ అధ్యక్షులు గంగాధర్ నాయడు, పార్టీ నేతలు, తిరునాల కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్