కోడుమూరు మండలంలోని అనుగొండ, ఎర్రదొడ్డి, గోరంట్ల గ్రామాల్లో శుక్రవారం ఎంపీడీవో రాముడు పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై తనిఖీ నిర్వహించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన ఆదేశించారు. అలాగే, అంగన్వాడీ సెంటర్లను సందర్శించి, చిన్నారులు, బాలింతలకు అందిస్తున్న ఆహారంపై సమీక్షించారు. అనంతరం గోరంట్ల గ్రామంలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.