క్రిష్ణగిరి మండలం జి. మల్లాపురంకు చెందిన హేమంత్, అతని స్నేహితుడు హరిజన శంకర్ తో కలిసి బైక్‌పై పురుగుల మందులు కొనుగోలు చేసేందుకు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో హేమంత్ మృతి చెందగా, శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఎస్సై ఎర్రిస్వామి సమాచారం మేరకు కోడుమూరుకు వస్తుండగా గుండ్లకొండ వాగు వద్ద బోలెరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. హేమంత్ తండ్రి గిడ్డయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.