కోడుమూరు: ఎరువుల విక్రయాల్లో నిబంధనలు పాటించాలి: ఏవో

కోడుమూరు మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో రసాయన ఎరువులు, పురుగుమందులు, విత్తనాల డీలర్లతో గురువారం సమావేశం జరిగింది. కర్నూలు డివిజన్ ఇన్‌చార్జ్ ఏడి ఎం. దస్తగిరి రెడ్డి, మండల వ్యవసాయ అధికారి రవిప్రకాష్, డీలర్లు హాజరయ్యారు. రైతుల భూమి విస్తీర్ణాన్ని బట్టి మాత్రమే ఎరువులు ఇవ్వాలని, అధిక ధరలకు విక్రయించకూడదని అధికారులు సూచించారు. ఇతర మండలాల రైతులకు తమ మండలాల్లోనే కొనుగోలు చేసేలా చూడాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్