రైతుల భూ హక్కులను భద్రపరచడం, భూ రికార్డుల్లో పారదర్శకతను పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ బుధవారం సి. బెళగల్ మండలం కొత్తకోట గ్రామంలోని స్వర్ణ గ్రామ కార్యాలయంలో రైతులకు ఈ పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. రైతులకు భూమిపై పూర్తి హక్కు, భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తోందని ఆయన తెలిపారు.