కర్నూలు: వైద్యురాలి ఇంట్లో నగదు, వెండి చోరీ

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అఫ్రీన్ ఇంట్లో చోరీ జరిగింది. కోడుమూరు నియోజవర్గ పరిధిలోని బాలాజీ నగర్‌లో నివసిస్తున్న డాక్టర్ అఫ్రీన్, కుటుంబ సభ్యులతో నంద్యాలకు వెళ్లిన సమయంలో దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి 500 గ్రాముల వెండి, రూ. 4, 000 నగదు చోరీ చేశారు. ఇంటికి తిరిగి వచ్చిన వైద్యురాలు చోరీ జరిగిన విషయం తెలుసుకుని గురువారం తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్