కర్నూలు: ఎన్టీఆర్ ఆశయాలతోనే చంద్రబాబు పాలన కొనసాగుతోంది

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా పేదరిక నిర్మూలన, సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగిస్తున్నారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మతో కలిసి ఎంపీ నాగరాజు పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన, అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్