కర్నూలు: కందుల కొనుగోలులో జాప్యం.. రైతుల కష్టాలు

ఈ నెల 1 నుంచి ఉమ్మడి జిల్లాలో కందుల కొనుగోలు ప్రారంభిస్తామని మార్క్‌ఫెడ్‌ అధికారులు ప్రకటించినా, పూర్తిస్థాయిలో కొనుగోలు జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. క్వింటానికి రూ. 8వేలు మద్దతు ధర ప్రకటించినా, కేంద్రాలు పనిచేయకపోవడంతో రైతులు రూ. 6వేల నుంచి రూ. 6,500కే వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. తరుగు పేరుతో వ్యాపారులు దోపిడీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 17 కేంద్రాల్లో కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం నాలుగు కేంద్రాల్లో మాత్రమే అరకొరగా ప్రారంభమైంది.

సంబంధిత పోస్ట్