కర్నూలు-హైదరాబాద్ 44వ జాతీయ రహదారిలో ఆటోలతో ప్రమాదకర విన్యాసాలు చేసి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన ముగ్గురు యువకులను ట్రాఫిక్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. శివ మల్లేష్, అఖిల్, గనమూరు జయసింహలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆటోలను రవాణా శాఖకు అప్పగించారు. రోడ్లపై ఇలాంటి విన్యాసాలు చేస్తే జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని సీఐ మన్సూరుద్దీన్ హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.