కర్నూలు: ఈనెల 30న మెగా జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, కోడుమూరు ఎమ్మెల్యే సహకారంతో ఈనెల 30న కర్నూలు రూరల్ మండలం బీ. తాండ్రపాడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఈ మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయి. 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతలు కలిగి, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 12,000 నుంచి రూ. 22,000 వరకు వేతనం లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలు కర్నూలు, అనంతపురం, శ్రీసిటీ ప్రాంతాల్లో ఉంటాయి.

సంబంధిత పోస్ట్