కర్నూలు: ప్రొటోకాల్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి

అమరావతి అసెంబ్లీ కమిటీ హాల్‌లో శుక్రవారం శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అధ్యక్షత వహించారు. శాసనమండలి సభ్యుల ప్రొటోకాల్ ఉల్లంఘన ఫిర్యాదులపై ఈ సమావేశం నిర్వహించారు. ఉల్లంఘనకు పాల్పడిన అధికారులకు నోటీసులు జారీ చేసి, వారి నుంచి వివరణలు స్వీకరించారు. భవిష్యత్తులో ప్రొటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కమిటీ ఆదేశించింది. ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్