కర్నూలు: సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఆకేపోగు

సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకేపోగు ప్రభాకర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. తల్లికి వందనం, శ్రీశక్తి, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా కోట్లాది మందికి లబ్ధి చేకూరిందని, పోలవరం, అమరావతి, సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్