కర్నూలు: యువ‌త ఉద్యోగాలు పొందేందుకు నైపుణ్యాలు నేర్చుకోవాలి

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ, ఒక్కరికైనా ఉద్యోగం లభిస్తే ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా నిలదొక్కుకుంటుందని అన్నారు. సోమవారం కర్నూలు నగరంలోని బి. క్యాంపు ప్రభుత్వ వోకేషనల్ జూనియర్ కాలేజీలో నిర్వహించిన జాబ్‌మేళాను ఆయన ప్రారంభించారు. ఈ జాబ్‌మేళా ద్వారా 17 కంపెనీలు మొత్తం 1125 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయని తెలిపారు. యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఉద్యోగాలను సాధించాలని, అదే సంస్థలో స్థిరపడేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్