టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకేపోగు ప్రభాకర్ శనివారం కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ నిర్వహించిన “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమాన్ని తప్పుబట్టారు. రాష్ట్ర ప్రజలకు అసలైన వెన్నుపోటు పొడిచింది వైఎస్సార్‌సీపీనే అని ఆయన విమర్శించారు. జగన్ ప్రభుత్వ హయాంలో చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీల భారం పెంచి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమై ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడంతోనే గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని అన్నారు.