గురువారం కోడుమూరు పట్టణంలో శ్రీరాముల దేవాలయం సమీపంలో అదుపుతప్పిన లారీ బైక్, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వై. ఖానాపురం వాసులైన రంగయ్య, బడేషావ్, శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో శ్రీనివాసులు పరిస్థితి విషమంగా ఉంది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో బైక్, కారు పూర్తిగా ధ్వంసమయ్యాయి.