కోడుమూరుకు నేడు మంత్రి అచ్చెన్నాయుడు రాక

రాష్ట్రంలో ఉల్లి సాగులో ముందున్న కర్నూలు జిల్లా రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉల్లి ధరల పతనంతో నష్టపోయిన 31,352 మంది రైతులకు సుమారు రూ. 100 కోట్లు ఆర్థిక సాయం అందించనుంది. శనివారం కోడుమూరులో వ్యవసాయశాఖ మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని శుక్రవారం కలెక్టర్ ఏ. సిరి తెలిపారు. ఎమ్మెల్యేలు, కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్